: ప్రొఫెషనల్స్ కోసం... అత్యంత పాప్యులర్ అయిన ఉచిత ఆన్ లైన్ కోర్సులు, వాటి వివరాలు!

క్లాస్ రూం నుంచి బయటకు రాగానే మీ విద్యాభ్యాసం ముగిసినట్టు కాదు. మీలోని నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఎన్నో సులభ మార్గాలు ఒక్క క్లిక్ దూరంలో ఉన్నాయి. ఆన్ లైన్లో ఎన్నో ఉచిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2015లో అత్యంత పాప్యులర్ అయిన ఉచిత ఆన్ లైన్ కోర్సుల వివరాలివి. * ఇంట్రడక్షన్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్ - యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా: వాట్రాన్ కు చెందిన ప్రఖ్యాత ప్రొఫెసర్ బ్రియాన్ జే బుషీ ఆర్థిక ఖాతాల నిర్వహణపై క్లాసులు ఇస్తారు. ఇన్ కం స్టేట్ మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో తదితరాల్లో ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చు. బ్రియాన్ స్వయంగా విద్యార్థుల సందేహాలు తీరుస్తారు కూడా. తదుపరి సెషన్ డిసెంబర్ 28 నుంచి- ఫిబ్రవరి 1 మధ్య ఉంటుంది. * సక్సెస్ ఫుల్ నెగోషియేషన్స్: ఎసెన్షియల్ స్ట్రాటజీస్ అండ్ స్కిల్స్ - యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్: రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యాపకుడు జార్జ్ సైడెల్ క్లాసులు తీసుకుంటారు. చర్చలు విజయవంతం కావడానికి ఎలా ప్రవర్తించాలి? ఏ వ్యూహాలు, నైపుణ్యాన్ని వాడాలన్న విషయమై సలహాలు, సూచనలు ఉంటాయి. ఓ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్నా, కేబుల్ బిల్లును తగ్గించుకోవాలన్న సూచనలు లభిస్తాయి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. * యాన్ ఇంట్రడక్షన్ టు ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ - రైస్ యూనివర్శిటీ: ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ లో అత్యాధునికమైనది పైథాన్. దీన్ని ఇప్పటికే గూగుల్, యాహూ, నాసా వంటివి వాడుతున్నాయి. దీనిపై సమగ్ర సమాచారాన్ని రైస్ వర్శిటీ ప్రొఫెసర్లు జోయ్ వారెన్, స్కాట్ రిక్సనర్, జాన్ గ్రీనర్ తదితరులు చెబుతారు. తదుపరి సెషన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉంటుంది. * టిబెట్ బౌద్ధుల ధ్యానం - ఆధునిక ప్రపంచం - యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా: జీవితం మరింత ప్రశాంతంగా సాగేందుకు టిబెటన్ల ధ్యాన మార్గం సహకరిస్తుందని చెబుతూ, ధ్యానం గురించిన క్లాసులను వర్జీనియా ప్రొఫెసర్లు డేవిడ్ ఫ్రాన్సిస్, కర్ట్ స్కాఫియర్ లు చెబుతారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. * ది డేటా సైంటిస్ట్స్ టూల్ బాక్స్ - జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ: డేటా సైంటిస్టులు ఏం చేస్తారు, వర్షన్ కంట్రోల్, మార్క్ డౌన్, గిట్, ఆర్ స్టూడియో వంటి టెక్నాలజీలపై జాన్స్ హాప్కిన్స్ ప్రొఫెసర్లు జెఫ్ లీక్, రోజర్ డీ పెంగ్ తదితరుల క్లాసులు తీసుకుంటారు. కోర్సు రెండు భాగాలుగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న సెషన్ జనవరి 2తో ముగుస్తుంది. * ఆర్ ప్రోగ్రామింగ్ - జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ: డేటా సైన్స్ ప్యాకేజీలో భాగంగా జాన్స్ హాప్కిన్స్ అందిస్తున్న మరో కోర్సు ఇది. డేటా అనాలిసిస్ లో అత్యంత పాప్యులర్ అయిన ఆర్ ప్రోగ్రామింగ్ విధానాన్ని పరిచయం చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న సెషన్ జనవరి 2తో ముగుస్తుంది. * మెషీన్ లెర్నింగ్ - స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన సాంకేతికతను ఇక్కడ తెలుసుకోవచ్చు. స్టాన్ ఫోర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, కౌర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్ర్యూ నెగ్ కేస్ స్టడీలు ప్రొఫెషనల్స్ కు అందుబాటులో ఉంటాయి. మెషీన్లు ఎలా నేర్చుకుంటాయి? వాటికి ఎలా నేర్పాలన్నది చెబుతారు. తదుపరి సెషన్ డిసెంబర్ 28 నుంచి మార్చి 21 వరకూ ఉంటుంది. * ప్రోగ్రామింగ్ ఫర్ ఎవ్రీబడీ - యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్: ప్రోగ్రామర్ల కోసం ఈ వర్శిటీ అందిస్తున్న ప్రారంభ కోర్సు. ప్రొఫెసర్ చార్లెస్ క్లాసులు తీసుకుంటారు. ఈ కోర్సులో పాల్గొంటే మంచి పునాదులు ఏర్పడతాయి. ప్రస్తుతం సెషన్ ఎన్ రోల్ మెంట్ జరుగుతోంది. డిసెంబర్ 21లోగా పేర్లు నమోదు చేసుకోవాలి. * మాస్టరింగ్ డేటా అనాలిసిస్ ఇన్ ఎక్సెల్ - డ్యూక్ యూనివర్శిటీ: డాటా సైంటిస్టులు చేసే పనిని మరింత సులువుగా ఎక్సెల్ లో ఎలా చేయవచ్చో చూపుతారు. వర్శిటీ నిపుణుడు జనా స్కయిచ్ బోర్గ్, డేనియల్ ఎగర్ లు విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వాస్తవానికి ఈ కోర్సు ప్యాకేజీకి ఫీజు 395 డాలర్లు. ఆన్ లైన్ లో ఉచితమే. తదుపరి సెషన్ డిసెంబర్ 14 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఉంటుంది. * లెర్నింగ్ హౌ టూ లెర్న్ - యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో: బ్రెయిన్ కెమిస్ట్రీని ఇక్కడ పరిచయం చేస్తారు. కొత్త సబ్జెక్ట్ ఎదురైన వేళ ఎలా ముందుకు సాగాలన్న విషయమై సలహాలు, సూచనలు లభిస్తాయి. ఓక్లాండ్ వర్శిటీ ప్రొఫెసర్ బార్బారా ఓక్లే, సాల్క్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ టెర్రెన్స్ లు క్లాసులు తీసుకుంటారు. తదుపరి సెషన్ జనవరి 4 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది.

More Telugu News