: నమ్మి పెట్టుబడులు పెడితే, వాటిని వేశ్యలకు ధారపోసిన బిట్ కాయిన్ సీఈఓ

ఇన్వెస్టర్ల సొమ్మును సొంతానికి వాడుకున్న బిట్ కాయిన్ అధినేత మార్క్ కార్పెలిస్ ను జపాన్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న తరువాత, ఆయన గురించిన ఒక్కో నిజం బయటకు వస్తోంది. క్లయింట్లకు చెందిన డబ్బును ఆయన సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని, ఎంతో మంది వేశ్యలకు కోట్లాది రూపాయలను ధారాదత్తం చేశాడని తెలుస్తోంది. జపాన్ లో అత్యధింగా అమ్ముడవుతున్న దినపత్రిక 'యోమురీ' కథనం ప్రకారం ఎంతో మంది అందమైన యువతులు ఆయన్ను కలుస్తుంటారట. 2011 నుంచి 2013 వరకూ ఎన్నోమార్లు పెట్టుబడిదారుల సొమ్ములను ఆయన సొంత కంపెనీలకు మళ్లించుకున్నాడన్న ఆరోపణలపై ఆగస్టులో కార్పెలిస్ ను తొలిసారిగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై కార్పెలిస్ బెయిలుపై బయటకు రాగా, నిన్న జపాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 321 మిలియన్ యన్ ల డిపాజిట్లను ఆయన కాజేసినట్టు సమాచారం. జపాన్ చట్టాల ప్రకారం, కనీసం మూడు వారాల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. డిజిటల్ వాల్ట్ ల్లోని 480 మిలియన్ డాలర్ల విలువైన 8.5 లక్షల కాయిన్స్ ను ఆయన కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. 80 శాతం బిట్ కాయిన్ లావాదేవీలను నిర్వహించే ఎంటీ గాక్స్ సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేసిన తరువాత కార్పెలిస్ ఆసాంఘిక కార్యకలాపాల గురించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

More Telugu News