: స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి పెప్సీ కంపెనీ

ప్రముఖ కూల్ డ్ర్రింక్ కంపెనీ పెప్సీ త్వరలో స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి కూడా అడుగిడనుంది. ఇప్పటివరకు వస్త్ర, సోడా, ఆహార వ్యాపారంలో పెప్సీ తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇకపై స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. 'పెప్సీ పి1' పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలిసింది. ఇప్పటికే చైనా సోషల్ మీడియా వైబోలో ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ తో ఓ ఇమేజ్ కూడా లీకైందని చెబుతున్నారు. దాని ప్రకారం 5.5 అంగుళాల పుల్ హెచ్ డీ డిస్ ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ ఎస్ ఓసీ, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉండనున్నాయి. చూడటానికి ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చైనాలో ఈ ఫోన్ ధర భారతీయ కరెన్సీలో రూ.13,350గా ఉంది. ఈ నెల 20న బీజింగ్ లో తమ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు పెప్సీ బ్లాగ్ లో ప్రకటించింది. పెప్సీ లోగోతో, చైనాకు చెందిన షెంజెన్ టెక్నాలజీ సంస్థ దాన్ని తయారు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి పెప్సీ ఫోన్ కేవలం చైనాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. వ్యాపార రంగాన్ని విస్తరించే ఉద్దేశంతో కాకుండా వినియోగదారుల మనసు గెలుచుకునేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నట్టు పెప్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆకర్షణీయమైన ఉత్పత్తులు, కొత్త కొత్త ఆలోచనలతో వినియోగదారులను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.

More Telugu News