ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు: డీజీపీ రాముడు

17-10-2015 Sat 11:44

ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమలకు రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ, తరువాత తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ నూతన టెర్మినల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తిరుమల, తిరుపతిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆ రోజు మోదీ పాల్గొంటారని డీజపీ తెలిపారు. ఇవాళ టాస్క్ ఫోర్స్ ఎస్సై అశోక్ పై జరిగిన దాడిని డీజీపీ ఖండించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను రూపుమాపుతామన్నారు. హెచ్ ఆర్సీ, కోర్టులతో తమపై ఒత్తిడి తెచ్చేందుకు స్మగ్లర్లు యత్నిస్తున్నారని, ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించేవారు ఎంతటివారైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు.