పుజారా ఇంట ధోనీ సేనకు పసందైన విందు భోజనం!

17-10-2015 Sat 07:23

టీమిండియా టెస్టు ప్లేయర్ ఛటేశ్వర్ పుజారా భారత వన్డే జట్టుకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేశాడు. వన్డే జట్టు సభ్యుడు కాకున్నప్పటికీ ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డే కోసం తన సొంతూరు రాజ్ కోట్ కు వచ్చిన ధోనీ సేనకు నిన్న పుజారా సౌరాష్ట్ర రుచులతో కూడిన విందు ఇచ్చాడు. తాను పిలవగానే విందు భోజనానికి వచ్చిన ధోనీ సేన సభ్యులందరికీ పుజారా కొసరి కొసరి వడ్డించాడు. అప్పటికే రోజుల తరబడి ఇంటి భోజనానికి దూరంగా ఉన్న వన్డే జట్టు సభ్యులు పుజారా ఇంటిలో కడుపు నిండా ఆరగించారు. విందు అనంతరం వన్డే కెప్టెన్ ధోనీ, టెస్టు కెప్టెన్ కోహ్లీల మధ్య నిలబడి పుజారా ఫొటోలకు పోజిచ్చాడు.