ఏపీ మంత్రులకు అపాయింట్మెంట్ నిరాకరించిన జగన్

16-10-2015 Fri 19:28

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఆహ్వాన పత్రం ఇచ్చేందుకు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నివాసంలో జగన్ ను కలిసేందుకు తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని మంత్రులు కోరారు. అయితే, అందుకు వీలుకాదని, అనుమతి ఇవ్వలేమని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. జగన్ విశ్రాంతిలో ఉన్నందున ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వడం కుదరదని ఆ నేతలు తేల్చి చెప్పారు. కాగా, శంకుస్థాపన కార్యక్రమానికి తాను హాజరుకానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కు జగన్ లేఖ రాశారు. తాను హాజరుకాకపోవడానికి గల కారణాలను అందులో ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానని చెప్పడంతో మంత్రులు పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.