ఐ ఫోన్ల కోసం బారులు తీరిన భారత కస్టమర్లకు థ్యాంక్స్: యాపిల్ సీఈఓ టిమ్

16-10-2015 Fri 18:17

గత రాత్రి విడుదలైన యాపిల్ ఐఫోన్లు 6 ఎస్, 6 ఎస్ ప్లస్ కోసం మొబైల్ స్టోర్ల ముందు క్యూ కట్టిన భారత వినియోగదారులకు ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. ఈ ట్వీట్ తో పాటు క్యూలో నిలబడి ఐ ఫోన్లు కొనుక్కుంటున్న కస్టమర్ల ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, గత అర్ధరాత్రి నుంచి భారత మార్కెట్ లోకి అందుబాటులోకొచ్చిన ఈ ఫోన్ల కోసం యాపిల్ రిటైల్ అవుట్ లెట్స్ ముందు కస్టమర్లు బారులు తీరారు. ఐ ఫోన్లను ముందుగా బుక్ చేసుకున్నవారు, కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్లతో అవుట్ లెట్స్ వద్ద సందడి నెలకొంది.