మొబైల్ మెయిల్ సేవలకు 'పాస్ వర్డ్' తొలగిస్తున్న యాహూ... కొత్త విధానమిదే!

16-10-2015 Fri 13:42

మొబైల్ యాప్ ద్వారా యాహూ మెయిల్ లోకి లాగిన్ కావాలంటే ఇకపై పాస్ వర్డ్ నొక్కాల్సిన అవసరం ఉండదు. యాహూ నుంచి మీ స్మార్ట్ ఫోన్ కు వచ్చే ఓ నోటిఫికేషన్ ను ప్రెస్ చేయడం ద్వారా మీ ఖాతాలోకి లాగిన్ అయిపోవచ్చు. ఈ దిశగా ఓ ప్రత్యేక 'ఎకౌంట్ కీ'ని అభివృద్ధి చేసిన యాహూ, పాస్ వర్డ్ వ్యవస్థను తొలగించాలని భావిస్తోంది. ఐఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లకూ ఈ సదుపాయాన్ని కల్పిస్తామని సంస్థ చెబుతోంది. దీనిద్వారా హ్యాకర్ల బారిన పడకుండా మొబైల్ యూజర్లు మరింత సేఫ్ గా ఉండవచ్చన్నది యాహూ ఆలోచన. కాగా, యూజర్లు అవసరమనుకుంటే పాస్ వర్డ్ వాడుతూ కూడా ఖాతాల్లోకి వెళ్లవచ్చని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ బాన్ ఫోర్టీ వెల్లడించారు. తమ కస్టమర్ల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.