ఇక ఫేస్ బుక్ నుంచి కూడా బ్రేకింగ్ న్యూస్... వచ్చే నెల నుంచే ప్రారంభం!

16-10-2015 Fri 08:58

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫేస్ బుక్ ది ప్రత్యేక స్థానమే. వినూత్న తరహాలో దూసుకువచ్చిన ఈ సంస్థ, విశ్వవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల మధ్య మెరుగైన సంబంధాలను నెలకొల్పింది. ఇన్నాళ్లూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గానే కొనసాగిన ఫేస్ బుక్, కొత్తగా మల్టీ ఫంక్షనింగ్ ఫ్లాట్ ఫామ్ గా రూపాంతరం చెందుతోంది. ఇందులో భాగంగా తన వినియోగదారులకు బ్రేకింగ్ న్యూస్ ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏఏ విభాగాలకు సంబంధించిన వార్తలు కావాలో వినియోగదారుడు ఎంచుకుంటే సరి, ఆ తరహా బ్రేకింగ్ న్యూస్ సదరు వినియోగదారుడికి చేరిపోతాయి. ఈ వార్తలను నేరుగా కాకుండా ఆయా న్యూస్ వెబ్ సైట్ల ద్వారానే లింకప్ చేస్తూ ఫేస్ బుక్ ఈ కొత్త వెసులుబాటుకు తెర తీస్తోంది. వచ్చే నెలాఖరు నాటికి ఈ వెసులుబాటును వినియోగదారులకు అందించేందుకు ఫేస్ బుక్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.