స్వైన్ ఫ్లూ బారినపడి బీజేపీ ఎంపీ కొడుకు మృతి

15-10-2015 Thu 21:45

ఛత్తీస్ గఢ్ కు చెందిన భారతీయ జనతాపార్టీ ఎంపీ చందులాల్ కుమారుడు రాజు సాహు స్వైన్ ఫ్లుా బారిన పడి మృతి చెందాడు. గత సెప్టెంబర్ 26న చందులాల్ పెద్దకుమారుడు రాజు స్వైన్ ఫ్లుా లక్షణాలతో రాయ్ పూర్ లోని స్థానిక ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న అతను ఈరోజు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనతో మహాసముంద్ ఎంపీ చందులాల్ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, దీంతో ఛత్తీస్ గఢ్ లో ఈ ఏడాది ఇప్పటివరకు స్వైన్ ఫ్లుా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 34కు చేరింది. 191 మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని, స్వైన్ ఫ్లుాను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని అక్కడి వైద్యాధికారులు చెప్పారు.