పిలవడం మా ధర్మం... రావడం, రాకపోవడం ఆయన విజ్ఞత!: జగన్ పై ఏపీ మంత్రులు

15-10-2015 Thu 16:31

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను తాము అమరావతి శంకుస్థాపనకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ తెలిపారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన మంత్రులు, పిలవడం తమ ధర్మమని, వచ్చేదీ, రానిదీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఎవరు వచ్చినా, రాకున్నా కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యకలాపాలను ఆపాలని ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ఆగవని అన్నారు. ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగిసేందుకు 8 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.