రెండు వారాల్లో డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్లు ఇస్తాం: మంత్రి గంటా

14-10-2015 Wed 17:56

ఏపీలో రెండు వారాల్లోగా డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్లు ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 1424 పాఠశాలలకు రేషనలైజేషన్ వర్తింపజేస్తామని విజయవాడలో చెప్పారు. ఉపాధ్యాయులకు ఏకీకృత నిబంధనలపై కమిటీ చర్చించిందనీ, డిటెన్షన్ విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. 8, 9 తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పదో తరగతిలో వెయిటేజీ ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి లీగల్ నోటీసు ఇస్తామని గంటా పేర్కొన్నారు.