విజయవాడలో వైసీపీ నిరసన మార్చ్ ను అడ్డుకున్న పోలీసులు

14-10-2015 Wed 17:08

ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన నిరసన మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని పిడబ్ల్యూ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు మార్చ్ నిర్వహించాలని వైసీపీ ప్రయత్నించింది. అయితే పిడబ్ల్యూడీ గ్రౌండ్ వద్దే పోలీసులు వైసీపీ నేతలు, కార్యకర్తలను నిలువరించారు. దాంతో వైసీపీ నేతలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.