నా సక్సెస్ ఘనత అంతా ఆమెదే!... సానియాపై భర్త షోయబ్ మాలిక్ ప్రశంసలు

14-10-2015 Wed 09:04

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ తో అబుదాబిలో జరుగుతున్న తొలి టెస్టులో నిన్న అతడు 124 (బ్యాటింగ్) పరుగులు చేశాడు. మొన్నటిదాకా పేలవ ప్రదర్శనతో పాక్ క్రికెట్ అభిమానుల సహనాన్ని పరీక్షించిన షోయబ్ ఈ సెంచరీతో కాస్త గాడిలో పడ్డట్టే కనిపించాడు. తన కెరీర్ లో మరోమారు పుంజుకోవడానికి గల కారణాలను చెబుతూ అతడు తన భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఆకాశానికెత్తేశాడు. తన కెరీర్ పుంజుకోవడంలో సానియా పాత్ర ఎంతో ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘ఇటీవల టెన్నిస్ లో సానియా విశేషంగా రాణిస్తోంది. ఆమె స్ఫూర్తితో నేనూ క్రికెట్ ను సీరియస్ గా తీసుకున్నా. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నా. ట్రైనింగ్ పట్ల నా దృక్పథం మారడానికి ఆమే కారణం’’ అని షోయబ్ వ్యాఖ్యానించాడు.