రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై సింగపూర్ ప్రతినిధుల ఆరా

13-10-2015 Tue 13:09

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై సింగపూర్ ప్రతినిధులు ఆరాతీశారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ రాయ్ కో ఉద్ధండరాయునిపాలెంలో సభాప్రాంగణంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలాన్ని అక్కడి నుంచి వేదికకు వచ్చే రోడ్డు మార్గాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ నెల 18 నుంచి భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ఎస్పీజీ దళాల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను చేపట్టనున్నామని వారు వెల్లడించారు. రాయ్ కోకు పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీయే అధికారులు వివరించారు.