భజన మాని ప్రత్యేకహోదా కోసం ప్రయత్నించాలి: వీహెచ్

12-10-2015 Mon 14:18

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భజన చేయడం మాని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొచ్చే దిశగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కృషి చేయాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ కు హామీ ఇచ్చి దీక్ష విరమింపచేయాలని ఆయన సూచించారు. జగన్ ఆరోగ్యం దెబ్బతింటే భవిష్యత్ లో బాధపడాల్సి వస్తుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఏది చేబితే ఎన్డీయే అది చేస్తుందని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లపై ఎన్డీయే ఆర్ఎస్ఎస్ విధానాన్ని అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు.