సంచలనాత్మక సెలబ్రిటీగా అమలాపాల్

12-10-2015 Mon 12:55

ఈ ఏడాది తమిళ సినీ రంగంలో అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీగా నటి అమలాపాల్ నిలిచింది. తరువాత స్థానంలో హీరో ఆర్య, మూడవ స్థానంలో సూర్య ఉన్నారు. ఇంటెల్ సెక్యూరిటీ గ్రూప్, మెక్ కెఫే సంయుక్తంగా 'మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో అమలా మొదటి స్థానంలో నిలిచారని ఇంటెల్ సెక్యూరిటీ గ్రూప్, ఇండియా ఇంజనీరింగ్ సెంట్రల్ హెడ్ వెంకట కృష్ణపూర్ తెలిపారు. సర్వేలో 11.53 శాతం మంది అభిమానులు అమలకు అనుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఆర్యకు 11.39 శాతం, సూర్యకు 10.83 శాతం, విజయ్ కు 10.69 శాతం, ఎమిజాక్సన్ కు 10.14 శాతం మొగ్గుచూపినట్టు వివరించారు. తమిళ సిినిమాలో ఆకర్షణీయమైన నటీనటులు పాల్గొన్న కల్చరల్ ఈవెంట్ లు, అవార్డు షోలు, టీవీ షోలు, ఫిల్మ్ మ్యూజిక్ లాంచ్ వంటి తదితర కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని వెబ్ సైట్ సర్వే నిర్వహించినట్టు తెలిపారు. గతేడాది సంచలనాత్మక సెలబ్రిటీగా ధనుష్ నిలిచారన్నారు.