ఆ కుటుంబ సభ్యులు తెల్లారి లేచి హడలిపోయారు!

12-10-2015 Mon 07:02

మన ఇంట్లో చిన్న పాము దూరితేనే బెదిరిపోతాం. దానిని బయటకు పంపేవరకో లేక చంపేవరకు నిద్రపోం. అలాంటిది ఏకంగా ఓ చిరుతపులి దూరితే...వామ్మో... ఇంకేదైనా ఉందా? హడలి చస్తాం! హర్యానాలోని పింజర్ లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో ఓ చిరుత పులి దూరింది. రాత్రంతా బాల్కనీలో సేదదీరింది. తెల్లవారి బాల్కనీలో చిరుతను చూసిన కుటుంబ సభ్యులు బెదిరిపోయారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగప్రవేశం చేసిన సిబ్బంది, సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి, మత్తుమందిచ్చి దానిని బంధించారు. దగ్గర్లోని అడవిలో విడిచిపెడతామని చెప్పారు. దీంతో ఆ కుటుంబ సభ్యలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.