భద్రాద్రి రామయ్యకు బంగారు పుష్పాలతో అభిషేకం

11-10-2015 Sun 13:27

భద్రాద్రి రాముడికి బంగారు పుష్పాలతో ఈరోజు వైభవంగా అభిషేకం జరిగింది. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ బంగారుపుష్పాలను శ్రీ సీతారామచంద్రస్వామి పాదాల వద్ద ఉంచారు. బంగారుపుష్పాల మధ్యన భద్రాద్రి రామయ్య మరింత శోభతో వెలిగిపోయాడు. రామనామాన్ని పలుకుతూ భక్తులు తాదాత్మ్యం చెందారు. సీతారాముల నిత్యకల్యాణాన్ని దర్శించేందుకు భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం అనంతరం ఆ అక్షింతలను, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య బాగానే ఉంది.