రాజధాని శంకుస్థాపనకు అతిథులు వీరే!

10-10-2015 Sat 20:20

ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మోదీ హాజరుకానుండగా, గౌరవ అతిథులుగా జపనీస్ స్టేట్ మినిస్టర్ మోతి, సింగపూర్ మినిస్టర్ ఈశ్వరన్, వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ భారతీయులు, విదేశాలలోని తెలుగువారు, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన నేతలు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు విచ్చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామానికి రాజధాని శంకుస్థాపనలో భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.