ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

15 వేల కోట్లున్నాయి...అయినా అశాంతి ... 'ఇదీ ఒక జీవితమేనా?' అంటూ వాపోతున్నాడు!

Fri, Sep 04, 2015, 05:56 PM
అతను 15 వేల కోట్ల రూపాయలకు యజమాని. ఎనిమిది బెడ్ రూంలు, 18 బాత్రూమ్ లు, 16 కారు పార్కింగ్ గ్యారేజీలు, వాటిల్లో ఖరీదైన కార్లు, అందమైన నగీషీలు కలిగిన ఫర్నిచర్ తో 18 అడుగుల డైనింగ్ హాల్, ఏ గదిలోంచి చూసినా అద్భుతంగా కనిపించే ఫసిఫిక్ మహాసముద్రం... 23 వేల చదరపు గజాల్లో సొంత భవనం. ఇవేవీ ఆ బిలియనీర్ కు సంతృప్తినివ్వడం లేదని వాపోతున్నాడు. స్వీడన్ కు చెందిన మార్కస్ పర్సన్ ది గత కొంత కాలం వరకు సాధారణమైన జీవితం. అవసరానికి సరిపడా డబ్బుంటే బాగుండేదని భావించేవాడు. కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేస్తూనే మైన్ క్రాఫ్ట్ అనే వీడియో గేమ్ ను కనిపెట్టాడు. దీనిని సుమారు పది లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో అతని అకౌంట్ ఫుల్లయిపోయింది. ఇంతలో మైక్రోసాఫ్ట్ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో మైన్ క్రాఫ్ట్ గేమ్ ను అమ్మేశాడు. దీంతో వేల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి.

అయితే, ఇతని బాల్యం కష్టాలమయం. తాగుబోతు తండ్రి నుంచి మార్కస్ తల్లి అతని 12 ఏటే విడిపోయింది. దొంగతనాలు చేసి జైలు పాలైన తండ్రి 2011లో ఆత్మహత్య చేసుకున్నాడు. మత్తుమందులకు బానిసైన సోదరి అన్నా ఇంటి నుంచి ఎటువెళ్లిపోయిందో ఆచూకీ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏడాది కాపురం చేసి విడిపోయింది. మరో పేద అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటే ఆమె కూడా ఓ సామాన్యుడితో వెళ్లిపోయింది.

దీంతో, లంకంత కొంపలో ఒంటరిగా మిగిలిపోయిన మార్కస్, ఒంటరితనం పోగొట్టుకునేందుకు సెలబ్రిటీలకు పార్టీలిస్తుంటాడు. వారు వెళ్లిపోయాక ఇదేనా తాను కోరుకున్నది? అని ఆలోచించి, పని వాళ్లను తీసుకుని విహార యాత్రలకు వెళ్లేవాడు. అయినా ఆనందం కలగలేదు. దీంతో 'కోరుకున్నది కాళ్ల దగ్గరకు వస్తే ఆనందం లేదు. దాని కోసం కలలు కనాలి, కష్టపడి దానిని సాధించుకోవాలి. సాధించిన విజయం తాలూకు అనుభూతిని ఆస్వాదించాలి. దాని నుంచి కొత్త లక్ష్యం నిర్దేశించుకోవాలి, దాని కోసం మళ్లీ కష్టపడాలి. అలా కాకుండా, తనలా లక్ష్యం లేకపోతే ఒంటరివారవుతార'ని మార్కస్ పేర్కొంటున్నాడు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107
Articles (Latest)
Ram Charan's wife Upasana reacts on little Ram Charan/ lit..
Ram Charan's wife Upasana reacts on little Ram Charan/ little Upasana arrival- Promo 2
Ex-husband makes revelations about Honeypreet-Ram Rahim's..
Ex-husband makes revelations about Honeypreet-Ram Rahim's relation
TDP will win 2024, 2029 apart from 2019 Elections; AP CM c..
TDP will win 2024, 2029 apart from 2019 Elections; AP CM could not stop laughing- Power Punch
NTR biopic 'Lakshmi's NTR' Row: RGV Vs TDP Babu Rajendra P..
NTR biopic 'Lakshmi's NTR' Row: RGV Vs TDP Babu Rajendra Prasad
Garuda Vega Teaser- Rajasekhar, Shraddha Das, Sunny Leone..
Garuda Vega Teaser- Rajasekhar, Shraddha Das, Sunny Leone
Jabardasth Getup Srinu in NERAM- A Thriller Short Film..
Jabardasth Getup Srinu in NERAM- A Thriller Short Film
Chandrababu Naidu Reveals his Food Habits and Daily Diet P..
Chandrababu Naidu Reveals his Food Habits and Daily Diet Plan
Breaking News: IRCTC bans debit card transactions for seve..
Breaking News: IRCTC bans debit card transactions for several banks
What is the Safest Car Color for Avoiding Accidents ?..
What is the Safest Car Color for Avoiding Accidents ?
What is wireless charging and how does it work ?..
What is wireless charging and how does it work ?
Dera Baba dirty secrets!..
Dera Baba dirty secrets!
Lakshmi's NTR Biopic Row: A soft warning to RGV by Lakshmi..
Lakshmi's NTR Biopic Row: A soft warning to RGV by Lakshmi Parvati
Jwala Gutta slams social media trolls; posts selfies..
Jwala Gutta slams social media trolls; posts selfies
Hindu NRIs cannot wear sindoor in America from now on?..
Hindu NRIs cannot wear sindoor in America from now on?
Had Steve Jobs not visited this temple in India, there wou..
Had Steve Jobs not visited this temple in India, there would have been no Apple
Locals busy in taking photos and recording videos when Dog..
Locals busy in taking photos and recording videos when Dog killed boy in Guntur
Savitri, Chittor Nagaiah died after spending final days in..
Savitri, Chittor Nagaiah died after spending final days in poverty: Adabala
Lakshmi's NTR Biopic Row: Babu Rajendra Prasad loses cool..
Lakshmi's NTR Biopic Row: Babu Rajendra Prasad loses cool, bursts out with strong counter to RGV-Exclusive
RGV's sensational comments on MLC Babu Rajendra Prasad..
RGV's sensational comments on MLC Babu Rajendra Prasad
Reasons behind JC Diwakar Reddy's Resignation- Exclusive s..
Reasons behind JC Diwakar Reddy's Resignation- Exclusive story
Film News (Latest)