: సూపర్ కార్ కు వజ్రాల లైట్లు

ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ కార్ ను తయారు చేసి గుర్తింపు తెచ్చుకున్న అరబ్ కార్ల తయారీ సంస్థ, 'డబ్ల్యూ మోటార్స్' తాజాగా మరో కారును రూపొందించింది. ఈ సూపర్ కార్ హెడ్ లైట్లలో వజ్రాలను పొదిగి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఈ సంస్థ. 'లైకన్ హైపర్ స్పాట్' పేరుతో రూపొందించిన ఈ కారు హెడ్ లైట్లలో వజ్రాలు పొదిగామని సీఈవో తెలిపారు. ఈ కారు ధరను 3.4 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో 21.11 కోట్ల రూపాయలు)గా నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ వజ్రాల కారు మోడల్ హాలీవుడ్ సినిమా 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' లో కనువిందు చేసింది. బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ లో చోరీకి గురైన కారుగా దీనిని ఆ సినిమాలో చూపించారు.

More Telugu News