: తదుపరి ఐ-ఫోన్ వెర్షన్ కోసం శామ్ సంగ్ సహకారాన్ని కోరిన యాపిల్!

తదుపరి ఐ-ఫోన్ వెర్షన్ ను మరింత జనరంజకం చేయాలని భావిస్తున్న యాపిల్ అందుకోసం కొరియన్ సంస్థ శామ్ సంగ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపినట్టు సియోల్ కేంద్రంగా వెలువడుతున్న 'మెయిల్ బిజినెస్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ డీల్ లో భాగంగా ఐ ఫోన్ కు అవసరం అయ్యే అత్యాధునిక ప్రాసెసర్ చిప్ లో 75 శాతం తయారీ శామ్ సంగ్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ డీల్ విలువ మాత్రం తెలియరాలేదు. టెక్సాస్ లోని శామ్ సంగ్ యూనిట్లో చిప్ ల తయారీ జరుగుతుందని సమాచారం.

More Telugu News