ఇరాక్ లో ఉన్న భారతీయుల భద్రతపై చర్చిస్తున్నాం: సుష్మా స్వరాజ్

04-08-2014 Mon 17:13

ఇరాక్ లో ఉన్న భారతీయుల భద్రతపై చర్చిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఇరాక్ లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని ఆమె చెప్పారు. మోసుల్ లో బందీలుగా ఉన్న 41 మందిని విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఇరాక్ లో అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ చిక్కుకున్న వారినందరినీ సురక్షితంగా భారత్ తిరిగివచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని సుష్మాస్వరాజ్ చెప్పారు.