కేసీఆర్ ను కలసిన తెలుగు సినీ ప్రముఖులు

04-08-2014 Mon 16:25

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలుగు సినీ ప్రముఖులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో 2 వేల ఎకరాలతో సినీ పరిశ్రమ కోసం సినిమా సిటీని సరికొత్తగా నిర్మిస్తానని కేసీఆర్ ప్రకటించడంపై తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని హంగులతో తెలుగు సినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఈ రోజు విజ్ఞాపన పత్రం అందజేశారు. అన్ని సాంకేతిక హంగులతో, అత్యాధునిక స్టూడియోలతో, అంతర్జాతీయ స్థాయి సినీ ప్రరిశ్రమను అద్భుతంగా నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారని సినీ ప్రముఖులు వెల్లడించారు. మంచి ఆలోచనలతో మరోసారి వస్తే సినీ పరిశ్రమపై మరింత సమగ్రంగా చర్చిద్దామని కేసీఆర్ తెలిపినట్టు వారు చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దర్శకుడు శంకర్, నిర్మాత సి.కల్యాణ్ ఉన్నారు.