గుంటూరు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన

04-08-2014 Mon 11:20

రుణమాఫీపై ఏపీ కాంగ్రెస్ నేతల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఏపీ పీసీసీ నేత రఘువీరారెడ్డి పాల్గొన్నారు.