పూణె ఘటనలో వంద దాటిన మృతుల సంఖ్య

04-08-2014 Mon 11:06

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర పూణె జిల్లాలో జులై 30న కొండ చరియలు విరిగిపడి మలిన్ గ్రామం భూస్థాపితమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు 108 మంది చనిపోయినట్లు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్ డీఆర్ఎఫ్) అధికారులు తెలిపారు. అటు ఘటనా స్థలాన్ని పరిశీలించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ పరిస్థితిని అంచనావేసి ప్రకృతి కారణాల వల్లే ఇలా జరిగిందని, దాదాపు 44 ఇళ్లు భూస్థాపితమయ్యాయని చెప్పింది.