: ఎంసెట్ కౌన్సిలింగుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ నెలాఖరు వరకు పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. తెలంగాణ ప్రభుత్వం 'ఫాస్ట్' పథకం మార్గదర్శకాల రూపకల్పనకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక వచ్చేందుకు మరికాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున... ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ నెలాఖరు వరకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వానికి దీటుగా ఉన్నతవిద్యామండలి తన వాదనలను వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఉన్నత విద్యామండలి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే షెడ్యూలును ప్రకటించింది. దీంతో ఈ కేసు విచారణపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏ తీర్పు చెబుతుందోనని, విద్యార్థి లోకంతో పాటు... ఏపీ, తెలంగాణల్లోని రాజకీయవర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

More Telugu News