బ్యాడ్మింటన్, హాకీల్లో రజతాలు సొంతం చేసుకున్న భారత్

03-08-2014 Sun 19:48

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు మరో రెండు రజత పతకాలను సొంతం చేసుకుని దేశప్రతిష్ఠను పెంచారు. మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ లో భారత్ జోడీ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప రజత పతకం సాధించారు. స్వర్ణపతకం కోసం జరిగిన పోరులో మలేసియా జోడి చేతిలో ఓటమిపాలవ్వడంతో రజతపతకం వీరి సొంతమైంది. పురుషుల హాకీ ఫైనల్ కు చేరిన భారత జట్టు, స్వర్ణపతకం కోసం జరిగిన పోరులో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓటమి పాలైంది. దీంతో భారత పురుషుల హాకీ జట్టు రజతపతకంతో తృప్తి చెందాల్సి వచ్చింది.