బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది... హిమాలయాలంత గొప్ప బంధం మనది: మోడీ

03-08-2014 Sun 17:20

నేపాల్ పర్యటన సందర్భంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. భారత్, నేపాల్ మధ్య బంధం హిమాలయాలు, గంగానది అంతటి పురాతనమైనదని, ఎవరెస్టు అంత బలమైనదని మోడీ పేర్కొన్నారు. నేపాల్ పార్లమెంటునుద్దేశించి తొలి అతిథిగా మాట్లాడడం తనను ఎంతో ఉద్వేగానికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం నేపాల్ వైపు ఆసక్తిగా చూస్తోందని ఆయన అన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా గొప్పదని మోడీ పేర్కొన్నారు. నేపాల్ ప్రజాప్రతినిధులు ఇచ్చిన గౌరవం భారత ప్రజలందరికీ చెందుతుందని ఆయన తెలిపారు. నేపాల్ ప్రజలు ధైర్యవంతులని... నేపాల్ హిమాలయాలంత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాజ్యాంగం ప్రజలను ఏకం చేస్తుందే తప్ప విడదీయదని ఆయన పేర్కొన్నారు.