రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగింది: వెంకయ్యనాయుడు

03-08-2014 Sun 16:05

రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పార్లమెంట్‌లో ఇన్సూరెన్స్ యాక్ట్ సవరణ బిల్లును త్వరలో ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. బీమారంగంలో 49% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తామని, ప్రతిపక్షాలు కూడా బీమా బిల్లుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పట్టణాభివృద్ది కోసం లోకల్ అథారిటీలు సక్రమంగా పనిచేయాలని ఆయన తెలిపారు. రాజకీయ రంగులను పులుముకోకుండా కేంద్ర నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.