: నేనే నియంతనైతే... ఒకటోతరగతి నుంచి భగవద్గీతను ప్రవేశపెడతా: సుప్రీం న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దవే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మ సంస్కృతిని సరిగ్గా ఆచరించకపోవడం వల్లే... భారతదేశంలో ఒకప్పటి 'గురుశిష్య పరంపర' కనుమరుగయ్యిందని ఆయన అన్నారు. దీని కారణంగానే దేశం ఇలాంటి దుస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు హేతువు... భారతదేశంలో హైందవ ధర్మం బలహీనపడడమే అని ఆయన ఆహ్మదాబాద్ లో జరిగిన సదస్సులో వ్యాఖ్యానించారు. తానే గనుక నియంతనైతే ఒకటోతరగతి నుంచే భగవద్గీత, మహాభారతాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతానని ఆయన అన్నారు.

More Telugu News