పీసీసీ పదవికి పొన్నాల రాజీనామా చేయాల్సిందే: కోమటిరెడ్డి

02-08-2014 Sat 15:10

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను పదవినుంచి ఎలాగైనా దింపేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే పదవికి పోటీచేసి ఓడిపోయిన పొన్నాల పార్టీని ఎలా నడిపిస్తారని సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూటిగా ప్రశ్నించారు. అసలు సమీక్షలు నిర్వహించే అర్హతే ఆయనకు లేదని నిప్పులు చెరిగారు. పొన్నాల నిర్వహించే సమీక్షా సమావేశాలతో ఒరిగేదేమీ లేదని, వెంటనే ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.