ఈ-గవర్నెన్స్ ను విస్తరించనున్న అఖిలేష్ ప్రభుత్వం

02-08-2014 Sat 13:33

ఉత్తరప్రదేశ్ లో ఐటీ, ఈ-గవర్నెన్స్ సేవలను మరింత విస్తరించాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రామినెంట్ కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ తో సమావేశాన్ని నిర్వహించారు. స్కిల్ డెవలప్ మెంట్, కంప్యూటర్ డెవలప్ మెంట్ తదితర అంశాలపై చర్చించారు. అన్ని ప్రభుత్వ విభాగాలను కంప్యూటరీకరణ చేసే యోచనలో అఖిలేష్ ఉన్నారు.