ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో తెలీదు కానీ, ఇరగదీస్తాడు: హేమ

01-08-2014 Fri 20:44

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో తెలియదు కానీ, డ్యాన్స్ అయినా... డైలాగైనా ఇరగదీస్తాడని క్యారెక్టర్ నటి హేమ తెలిపారు. ‘రభస’ ఆడియో ఫంక్షన్లో ఆమె మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ స్పాట్ లో కనిపించినా కనిపించకపోయినా ‘షాట్ రెడీ’ అనే సరికి వచ్చి రచ్చరచ్చ చేస్తాడని అన్నారు. ఆయన డ్యాన్స్ వేస్తే ఆ వేగానికి ఎవరైనా ముగ్థులు కావాల్సిందేనని హేమ అన్నారు. అలాగే ఆయన ఎప్పుడు స్క్రిప్టు చూస్తారో తెలియదు కానీ, అదిరిపోయే లెవెల్లో డైలాగులు చెబుతారని ఆమె అన్నారు. ‘రభస’ సినిమా అందర్నీ అలరిస్తుందని ఆమె పేర్కొన్నారు.