19వ తేదీన తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే

01-08-2014 Fri 19:26

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న ఈ సర్వేలో 84 లక్షల కుటుంబాల వివరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీఎస్ ప్రభుత్వం పేర్కొంది. సర్వే నిర్వహణ కోసం ఈ నెల 11న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉద్యోగులకు ఒక్క రోజు శిక్షణను ఇవ్వనున్నారు. సర్వే నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రెండు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. సర్వే చేసిన ఇళ్లపై తెలంగాణ రాజముద్ర వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.