బీమా బిల్లులో మార్పులు చేయాల్సిందే: ప్రతిపక్షాల డిమాండ్

01-08-2014 Fri 18:53

బీమా బిల్లులో మార్పులు చేయాలని అంటున్నాయి కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలు. ఈ మేరకు బిల్లులో మార్పులు చేయాలంటూ ఈ 9 పార్టీలు రాజ్యసభ ఛైర్మన్ కు లేఖ రాశాయి. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ, జనతాదళ్ (యు), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో కలిసి... మొత్తం 9 పార్టీలు బీమా బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలంటూ ఈ లేఖలో పేర్కొన్నాయి.