: డీఎస్పీ హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన అఖిలేశ్ యాదవ్

డీఎస్పీ జియా ఉల్ హక్ హత్య కేసు వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. మరణించిన డీఎస్పీ కుటుంబాన్ని అఖిలేశ్ ఈ మధ్యాహ్నాం పరామర్శించారు. ఈ సమయంలో పలువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదైన వారందరినీ అరెస్టు చేస్తామన్నారు.

కాగా, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని, కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అఖిలేశ్ ప్రకటించారు. అంతకుముందు ఈ వ్యవహారంలో పదవికి రాజీనామా చేసిన రాజా భయ్యా మాట్లాడుతూ... డీఎస్పీతో సమస్య ఉంటే వేరే చోటికి బదిలీ చేస్తాను కానీ, హత్య చేయించనని చెప్పారు.

More Telugu News