పాపం చేయనీయని పాండురంగడు
మద్యానికి బానిసలు కావడమంటే ఎవరి అభివృద్ధికి వారు అడ్డుగోడలు కట్టుకోవడమే అవుతుంది. అయితే మద్యానికి బానిసలు అయిన వాళ్లు ... ఎవరు ఎన్ని విధాలుగా హితవు చెప్పినా పెద్దగా పట్టించుకోరు. తల్లిదండ్రులు ... భార్యా పిల్లలు ఇలా ఎవరెన్ని విధాలుగా పోరినా వారితీరు వారిదే. ఇలాంటి వారి విషయంలో ఏం చేయాలో తోచని వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నాడు 'ఉంతకల్లు పాండురంగడు'. అవును మద్యానికి అలవాటుపడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకునే వారు ఆయన చెప్పినట్టు వినితీరవలసిందే ... మాట్లాడకుండా మద్యం మానవలసిందే.
మనిషి వ్యసనాల గురించి దేవుడు పట్టించుకుంటాడా? ఆ వ్యసనాల బారి నుంచి వారిని బయటపడేయడానికి ఆయన ప్రయత్నిస్తాడా? అనే సందేహం కలగకపోదు. అయితే వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్కడి వారి విశ్వాసం. మనుషులను మంచిమార్గంలో నడిపించే ఈ పాండురంగడు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం సమీపంలో కొలువుదీరాడు.
చాలాకాలం క్రితమే ఇక్కడి ప్రజలంతా కలిసి పాండురంగ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో తాగుడు వ్యసనం విపరీతంగా ఉండటంతో, అలాంటి వారికి బలవంతంగా మాలధారణ చేయించి ఆ స్వామి దీక్షను ఇప్పించారు. అంతే ఆ తరువాత వాళ్లు మళ్ళీ మద్యం జోలికి పోలేదు. అలా మద్యానికి బానిసలైన వాళ్లు ఇక్కడికి వచ్చి మాల ధారణ చేయడం ... ఆ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడటం జరుగుతూ వస్తోంది.
ప్రతినెలా వచ్చే ఏకాదశి న రెండు రోజులు మాత్రమే ఇక్కడ దీక్షను ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఆ రోజుల్లో భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువగా వుంటుంది. మాలధారణ చేసిన వారు మూడు ఏకాదశుల పాటు అక్కడ నిద్ర చేయవలసి వుంటుంది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు కావలసిన ఏర్పాట్లను గ్రామస్తులే చూస్తుండటం విశేషం.