శ్రీ గాయత్రీ మాత క్షేత్రం
మహాశక్తి స్వరూపిణిగా గాయత్రీమాతను గురించి పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీ అనగా ప్రాణాలను రక్షించునది అనే అర్థం చెప్పబడుతోంది. సమస్తలోకాలలోని సమస్తాన్ని ఆ తల్లే నడిపిస్తుందని అంతా విశ్వసిస్తుంటారు. అన్నిమంత్రాల కంటే గాయత్రీదేవి మంత్రం అత్యంత శక్తిమంతమైనది. గాయత్రీ మంత్రంలో 24 బీజాక్షరాలు వుంటాయి. ఈ 24 బీజాక్షరాలకు ... కాలంలోని సమయాన్ని సూచించే 24 గంటలకు మధ్య అవినాభావ సంబంధం వుందని చెబుతారు.
గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలలో 24 దేవతా శక్తులు నిక్షిప్తమై వున్నాయి. ఈ కారణంగానే వాల్మీకి మహర్షి రామాయణంలోని ప్రతి వెయ్యి శ్లోకాలలోని మొదటి శ్లోకాన్ని ఈ మంత్రంలోని బీజాక్షరంతో ప్రారంభించాడు. అలా ఆయన ఈ మంత్రంలోని 24 బీజాక్షరాలతో 24000 శ్లోకాలను రచించి రామాయణ మహా కావ్యాన్ని పూర్తి చేశాడు. అంతటి శక్తిమంతమైన గాయత్రీదేవి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ వుంటాయి.
అలాంటి వాటిలో విశిష్టతను సంతరించుకున్నదిగా రంగారెడ్డి జిల్లా - అన్నోజీగూడలోని శ్రీ గాయత్రీమాత ఆలయం దర్శనమిస్తోంది. ఇక్కడి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఓ భక్తుడు అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. శ్రీ చక్రాకారంలో నిర్మించబడిన ఈ ఆలయం, ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది. గర్భాలయంలో అమ్మవారు పంచముఖాలతో ... కలువల వంటి నేత్రాలతో ... చక్కని ముక్కెరతో వెలిగిపోతూ వుంటుంది.
అమ్మవారి సన్నిధిలోగల శ్రీ చక్రమేరుకు కుంకుమ పూజలు జరుపుతుంటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. వేదమాత అయిన అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానంతో పాటు సకల సంపదలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు ... అనునిత్యం ఆ తల్లిని పూజిస్తూ పునీతులవుతుంటారు.