వరాలనిచ్చే వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామి క్షేత్రాలకు వెళితే ఆయనకి ఒంటరిగా ఉండటం అసలు ఇష్టం ఉండదేమోననిపిస్తుంది. అంతగా ఆయన ఆలయాలు ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆయన ఎక్కడ వెలిసినా భక్తులు వెతుక్కుంటూ మరీ వెళ్లి ఆచూకీని కనిపెట్టేస్తారు. పవిత్రమైన ఆయన పాదాలను ఆశ్రయించి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ఆయన పాదాలను ఆశ్రయించనిదే ఈ జన్మ సార్థకం కాదు ... మరో ఉత్తమైన జన్మ లభించదనే విషయాన్ని భక్తులు బలంగా నమ్ముతూ ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
వేంకటేశ్వరుడు వెన్నలాంటి మనసున్నవాడు కావడం వలన, కొలిస్తే సంతోషిస్తాడనీ ... పిలిస్తే లక్ష్మీదేవి సమేతంగా తరలి వస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ స్వామిని సేవించడం వలన సిరిసంపదలు లభిస్తాయనీ ... కష్టాలు కనుచూపుమేరలో లేకుండా పోతాయని భావిస్తుంటారు. అందుకే తమ మనసులోని మాటను ఆయనకి చెప్పుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకి వస్తుంటారు.
అలా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలలో ఒకటి 'అప్పన్నపేట'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. శ్రీదేవి ... భూదేవి సమేతంగా ఇక్కడి వేంకటేశ్వరుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. 'అప్పన్న' అనే ఒక భక్తుడి కారణంగా ఇక్కడి స్వామి వెలుగులోకి వచ్చినందు వలన ఈ ఊరుకి ఈ పేరు వచ్చిందని అంటారు. అమ్మవార్లతో సహా గర్భాలయంలో కొలువుదీరిన స్వామి, తన భక్తులను కరుణించడంలో ఎంతమాత్రం ఆలస్యం చేయడని చెబుతుంటారు. కోరిన వరాలను అనతికాలంలోనే స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడని అంటారు.
ఈ కారణంగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. స్వామివారికి తమ మనసులోని మాటను చెప్పుకుని ... మొక్కుకుని వెళుతుంటారు. ఇక కొన్ని శక్తి క్షేత్రాలలో మాత్రమే కనిపించే కొన్ని ఆచారాలు ఇక్కడ కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాల వెనుక, బలమైన కారణం లేకపోలేదని చెబుతుంటారు.