అమ్మవారు అలా మహిమ చూపిందట !
మహిమల గురించి చెప్పుకోవలసి వస్తే, సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి గురించి చెప్పుకోవాలనే మాట మనకి నెల్లూరు పరిసరాల్లో ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. ఈ ప్రాంతవాసులందరికీ ఆ తల్లి మహిమలు ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చినవే. అందుకే అంతా ఆమెని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తుంటారు.
ప్రతి ఒక్కరూ ఆమెని పెద్ద ముత్తయిదువగా ... పెద్ద దిక్కుగా విశ్వసిస్తూ వుంటారు. ఏ శుభకార్యామైనా ఆమె అనుమతితో ... ఆశీర్వాదంతో ... ఆహ్వానంతో మొదలవుతుంది. అంతగా ఇక్కడి చెంగాళమ్మ పరమేశ్వరి భక్తుల హృదయాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంది.
అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించిన తీరే, మహిమాన్వితమైన సంఘటనగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడి నదీ తీరంలో గల ఇసుకలో కూరుకుపోయిన అమ్మవారి విగ్రహం, ఈ ప్రదేశానికి చెందిన కొంతమంది కంటపడిందట. క్షణాల్లో ఈ వార్త ఊరంతా వ్యాపించింది. అంతా కలిసి అమ్మవారి ప్రతిమను బయటికి తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
దాంతో ఆ విగ్రహాన్నిఎలా పైకి లేపాలా అని ఆలోచిస్తూనే ఎవరి ఇంటికి వాళ్లు చేరుకున్నారు. మరునాడు అంతా కలిసి వచ్చేసరికి, విగ్రహం దానంతట అది నిలబడి ఉండటం చూసి నివ్వెరపోయారు. తన మహిమను చూపడానికే ఆ తల్లి అలా చేసిందనీ, తమని అనుగ్రహించడం కోసమే ఆమె వచ్చిందని అంతా భావించారు.
అందరికీ 'అమ్మా' అని పిలుచుకునే భాగ్యం దక్కిందనుకుంటూ, భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక్కడి భక్తులను కదిలిస్తే చాలు ... అమ్మవారు తమని ఎలా కాపాడుతూ వస్తుందనే విషయాన్ని ఆనందంగా చెబుతుంటారు. ఆసక్తికరమైన ఆ సంఘటనల గురించి వింటూ వుంటే మనసు పులకించిపోతుంది. జగాలనేలే ఆ తల్లిని అలా చూస్తూవుంటే జన్మతరించిపోతుంది.