శనిదేవుడి అనుగ్రహాన్ని అందించే క్షేత్రం
ఏ దోషం నుంచైనా ఎలాగో అలా బయటపడవచ్చుగానీ, శనిదోషం నుంచి బయటపడటం మాత్రం అంత తేలికకాదనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తూ వుంటుంది. అందుకే శని అనే పేరు వినగానే ఎంతటివారైనా సరే కంగారుపడిపోతుంటారు. శని ప్రభావం నుంచి ఉపశమనం లభించినా చాలునని చెప్పి, అందుకు సంబంధించిన పరిహారాలు చేయడం మొదలుపెడతారు.
శనిదేవుడి అనుగ్రహం సంపాదించడం కోసం, ఆయన కొలువైన క్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. ఆ స్వామికి తైలాభిషేకాలు చేసి శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా శనిదోషం నుంచి బయటపడాలనుకునే వాళ్లు, 'గడిదం' క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలో గల ఈ శనీశ్వరుడి క్షేత్రం, ప్రసిద్ధి చెందినటువంటి వేంకటేశ్వరస్వామి ఆలయానికి దగ్గరలోనే దర్శనమిస్తూ వుంటుంది.
గర్భాలయంలో స్వామి శాంతమూర్తిగా, భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ వుంటాడు. స్వామివారికి ఎదురుగా ఆయన వాహనమైన 'కాకి' శిలారూపంలో కనిపిస్తూ వుంటుంది. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి, భక్తులు స్వామివారికి పూజాభిషేకాలు జరుపుతుంటారు. తనని దర్శించుకున్న భక్తులపై తన ప్రభావాన్ని తగ్గిస్తూ స్వామి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తాడనీ, అనతికాలంలోనే ఆ దోషం నుంచి బయటపడేస్తాడని బలంగా చెబుతుంటారు.
ఇక్కడి కొండరాళ్ల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన 'కోనేరు' స్వచ్ఛమైన జలాలతో భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది. ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది కూడా ఈ కోనేరే. ఇది ఎంతో పవిత్రమైన తీర్థమనీ, ఈ కారణంగానే పూర్వం ఎంతోమంది సిద్ధులు ... యోగులు ఇక్కడ ధ్యానం చేసుకున్నారని స్థానికులు చెబుతుంటారు. శనిదోషంతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు, పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ స్వామిని దర్శించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని స్పష్టం చేస్తుంటారు.