దైవదర్శనానికి ఇలా వెళ్లడమే మంచిది !
పుణ్యక్షేత్రాలకు అనగానే చాలామంది కుటుంబసమేతంగా బయలుదేరుతుంటారు. ఇంట్లో ఎవరూ ఉండనప్పుడు ఆభరణాలను వదిలి వెళ్లడం మంచిదికాదని భావించి, ఉన్నవన్నీ కూడా వెంట తీసుకుని వెళుతూ వుంటారు. ఇక క్షేత్రానికి చేరుకున్న తరువాత, అక్కడి సత్రాలలోగానీ ... అద్దె గదులలో గాని వాటిని ఉంచడం మంచిది కాదనుకుంటారు. సంప్రదాయబద్ధమైన వస్త్రాలలోనే దైవదర్శనం చేసుకోవాలి కాబట్టి, అందుకు తగిన విధంగా ఎక్కువ ఆభరణాలను ధరిస్తుంటారు.
ఇక పురుషులు కూడా తమ స్థాయికీ ... హోదాకి తగినట్టుగా బంగారు ఆభరణాలతో కనిపిస్తుంటారు. దైవదర్శనం కోసం వెనక నుంచి తోపులాట మొదలవుతుంది. ఆ హడావిడిలో ఆభరణాలు ఎక్కడైనా పడిపోతాయేమోననీ, ఎవరైనా కాజేస్తారేమోనని ఆందోళనకి లోనుకావడం జరుగుతూ వుంటుంది. భగవంతుడి దగ్గరికి చేరుకున్నప్పటికీ, దృష్టి మాత్రం ధరించిన ఆభరణాలపైనే వుంటుంది.
అక్కడి నుంచి బయటికి వచ్చిన తరువాత దైవదర్శనం మనస్పూర్తిగా చేసుకోలేక పోయినందుకు బాధ కలుగుతుంది. 'చిత్తం శివుడి మీద ... భక్తి బంగారం మీద' అనే మాటే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అందుకే ఎక్కడ దైవదర్శనానికి వెళ్లినా, సాధ్యమైనంత వరకూ నిరాడంబరంగా వెళ్లడమే అన్నివిధాల మంచిది. అప్పుడే భగవంతుడిపై మనసు నిలుస్తుంది. ప్రశాంతంగా ఆయనని అడగడానికీ ... ఆయన ప్రసాదించడానికి అవకాశం కలుగుతుంది.
ఒకసారి యాత్రలకి బయలుదేరిన పురందరదాసు, తన భార్య మనసు భగవంతుడి నామస్మరణంపైన కాకుండా, చేతిలోని వెండిచెంబుపై ఉండటం గమనిస్తాడు. ఆ చెంబును ఎవరైనా కాజేస్తారేమోనని ఆమె ఆందోళన చెందుతూ వుండటం చూసి దానిని దూరంగా విసిరేస్తాడు. భగవంతుడిని సమీపించడానికి అలాంటివే అడ్డని భార్యతో చెబుతాడు. అందుకే భగవంతుడిపై మనసు నిలవాలంటే ... ఆయన దర్శనం ఆనందానుభూతులను అందివ్వాలంటే నిరాడంబరంగా ఆయనని దర్శించాలానే విషయాన్ని మరిచిపోకూడదు.