ఈ పవిత్ర ప్రదేశంలో పాపాలు నశిస్తాయట !
పుణ్యక్షేత్రాల దర్శనం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్లు అహింసా మార్గంలో ప్రయాణం చేస్తారు. గతంలో చేసిన పాపాల నుంచి బయట పడటానికి గాను మరిన్ని క్షేత్రాలను దర్శిస్తూ ... దివ్యతీర్థాలను సేవిస్తూ వుంటారు. అలా హరిహరరాయలు తన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి అడుగుపెట్టిన క్షేత్రంగా 'కనకసురభేశ్వర క్షేత్రం' దర్శనమిస్తుంది.
ప్రకాశం జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా స్థలపురాణం చెబుతుంది. జమదగ్ని మహర్షి వంటి వారిచే పూజలందుకున్న ఇక్కడి శివుడు, కనకసురభేశ్వరుడు పేరుతో భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. అలాంటి ఈ క్షేత్రంలో హరిహరరాయలు అడుగుపెట్టడం జరిగింది. ఆయన పేరు ప్రస్తావించకుండా విజయనగర సామ్రాజ్య చరిత్రను చెప్పలేం.
అలాంటి హరిహరరాయలు ఒకానొక పాపభారాన్ని మోయలేక, దాని బారి నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడట. తన మనసుకి ఏ ప్రదేశంలో శాంతి లభిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. అలా బయలుదేరిన ఆయన ఇక్కడి కనకసురభేశ్వర క్షేత్రానికి చేరుకోగానే, ఆయనకి ఎంతో మానసిక ప్రశాంతత లభించిందట.
ఇది మహిమాన్వితమైన క్షేత్రమని భావించిన ఆయన, ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. స్వామి అనుగ్రహంతో ఆ పాపం నుంచి విముక్తిని పొంది తిరిగివెళ్లాడని చెబుతుంటారు. ఆయన ప్రతిష్ఠింన శివలింగం 'పాపనాశేశ్వరుడు' పేరుతో ఇక్కడ పూజలు అందుకుంటూ వుంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడం వలన, పాపల వలన కలిగే ఫలితాల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.