వృద్ధుడిగానే వుండమంటూ శివుడికే శాపమా?
శ్రీశైలం క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో అరుదైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. మరెన్నో విశేషాలు స్థలపురాణంగా వినిపిస్తుంటాయి. అలా వినిపించే ఆసక్తికరమైన కథనాల్లో వృద్ధ మల్లికార్జునుడు పేరు కూడా వినిపిస్తూ వుంటుంది. ఈ వృద్ధ మల్లికార్జునుడు ప్రధాన దేవాలయ ప్రాంగణంలో ఉపాలయంలో దర్శనమిస్తూ వుంటాడు. పరమశివుడు ... వృద్ధ మల్లికార్జునస్వామిగా, అమ్మవారు భ్రమరాంబగా పిలవబడుతూ ఉండటం వెనుక ఎన్నో కథనాలు ప్రచారంలో వున్నాయి.
అయితే జానపదులు చెప్పుకునేదిగా అనిపించే ఓ కథ కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తూ వుంటుంది. శివపార్వతులు వేరే రూపాలలో కొండజాతి వాళ్ల సమక్షంలో వివాహమాడినట్టుగా ఈ కథ చెబుతూ వుంటుంది. శివుడిని ఆరాధిస్తూ వస్తోన్న ఓ యువతి ఆయన పట్ల ప్రేమను పెంచుకుంటుంది. ఆయనని వివాహమాడాలనే కోరికతో వున్న ఆమె, ఓ భ్రమరాన్ని అనుసరిస్తూ ఈ ప్రదేశానికి చేరుకుంటుంది.
కొండజాతి వాళ్లు ఆమెను తమ కూతురుగా భావించి చేరదీస్తారు. అలా కొంతకాలం గడిచాక ఆమె ప్రేమను పరీక్షించడం కోసం ఓ రోజున శివుడు వృద్ధుడు రూపంలో వస్తాడు. అయినా ఆయనను వివాహం చేసుకోవడానికి ఆమె అంగీకరించి అర్థాంగి అవుతుంది. అయితే ఆ సమయంలో వచ్చిన మాట పట్టింపు కారణంగా, శివుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు.
దాంతో ఆగ్రహించిన ఆమె వృద్ధుడిగా లింగరూపంలో అక్కడే ఉంటూ పూజలు అందుకోమంటూ శపిస్తుంది. తుమ్మెదను అనుసరిస్తూ వచ్చిన కారణంగా ఆమె అక్కడ భ్రమరాంబ పేరుతో కొలువుదీరుతుంది. ఈ కారణంగానే కొండజాతి వాళ్లు అమ్మవారిని తమ కూతురిగా ... శివుడిని అల్లుడిగా భావించి పూజిస్తుంటారు. ఈ కథలో నిజానిజాల మాట ఎలా వున్నా, అది కొండజాతివారితో ఆదిదంపతులకు గల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.