తేజో రూపంలో స్వామి సంచరించిన క్షేత్రం
వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలన్నీ కూడా దాదాపు కొండలపైనే దర్శనమిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో స్వామివారికి తమ హృదయంలో స్థానమిచ్చిన ఒక్కో కొండ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది. అలా తన భారాన్ని మోయడానికి ముందుకు వచ్చిన ఓ కొండపట్ల కృతజ్ఞతతో, అక్కడ తేజో రూపంలో ఉండటానికి స్వామివారు అంగీకరించారట.
అలా స్వామివారిపట్ల అత్యంత భక్తి శ్రద్ధలను ప్రదర్శించి, ఆయనచే అరుదైన వరాన్ని పొందిన ఆ కొండ 'మల్లవరం'లో కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒకసారి ఈ ప్రాంతం మీదుగా వెళుతూ, ఇక్కడ తేజో రూపంలో సంచరిస్తోన్న స్వామివారిని చూస్తాడు. ఆ కొండకు స్వామివారు ఇచ్చిన వరాన్ని గురించి తెలుసుకుంటాడు.
తేజో రూపం సామాన్యులు చూడటానికి సాధ్యం కానిది. అందువలన అందరూ దర్శించాలనే ఉద్దేశంతో స్వామివారి విగ్రహాన్ని నారద మహర్షి ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఆ రోజు నుంచి ఈ చుట్టుపక్కల గల ప్రజలంతా స్వామివారిని పూజిస్తూ పునీతులవుతున్నారు. అయితే ఈనాటికీ ఇక్కడికి దేవతలు ... మహర్షులు అదృశ్య రూపంలో వచ్చి స్వామివారిని సేవించి వెళతారని చెబుతుంటారు.