భక్తుడిని చూడకుండా భగవంతుడు ఉండలేడు
ఉడిపి శ్రీకృష్ణుడిని చూడాలనే కోరిక కనకదాసులో అంతకంతకూ పెరిగిపోసాగింది. ఆ స్వామిని దర్శించకుండా ఇక తాను ఉండలేననే విషయం కనకదాసుకు అర్థమైపోతుంది. దాంతో ఉన్నపళంగా బయలుదేరి 'ఉడిపి' చేరుకుంటాడు. ఎప్పుడెప్పుడు స్వామిని చూడాలా అనే ఆతృతతో ఆ ఊరు చేరుకున్న కనకదాసు, ఆరాటంగా ఆలయంలోకి అడుగుపెడతాడు.
ఊహించని విధంగా ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో కనకదాసు బిత్తరపోతాడు. వాళ్లు ఆయన కులాన్ని గురించిన ప్రస్తావన చేస్తూ, దైవదర్శనం చేసుకునే అర్హత ఆయనకి లేదంటూ బయటికి పంపిస్తారు. భగవంతుడు అందరివాడనీ ... ఆయనని ఎవరైనా దర్శించుకోవచ్చని అంటాడు కనకదాసు. ఈ విషయంలో ఆయన ఎంతగా వాదించినా ప్రయోజనం లేకపోతుంది. కృష్ణుడిని చూడకుండా వెనుదిరిగేది లేదంటూ, ఆ రాత్రి ఆయన ఆలయం ముందే ఉండిపోతాడు.
ఊహించని విధంగా స్వామివారి ఆభరణం ఆ రోజే మాయమవుతుంది. దానిని దొంగిలించినది కనకదాసేనని వాళ్లు భావించి , దేవాలయానికి వెనుక భాగంలో గల ఒక స్తంభానికి కట్టేసి హింసించసాగారు. సరిగ్గా ఆ సమయంలోనే గర్భాలయానికి గల వెనుక భాగం గోడకి పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. గర్భాలయంలో గల కృష్ణుడి విగ్రహం, ఆ రంధ్రం వైపుకు తిరుగుతుంది.
ఆ రంధ్రం ద్వారా స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించిన కనకదాసు, సంతోషంతో పొంగిపోతాడు. ఆ దృశ్యం చూసిన ఆలయ సిబ్బందికి ఆయన ఎంతటి మహా భక్తుడో బోధపడుతుంది. దాంతో తమ తప్పును మన్నించమంటూ పశ్చాత్తాపంతో ఆయన పాదాలపై పడతారు.