కోరికలు నెరవేర్చే మెట్ల ఉత్సవం !
లోక కల్యాణం కోసం భగవంతుడు దివి నుంచి భువికి దిగివచ్చాడు. మహర్షుల మాటను కాదనలేక ... మహా భక్తుల అభ్యర్థనను ఆలకించి అనేక ప్రాంతాలలో ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో ఆయా సందర్భాలను బట్టి కొన్ని క్షేత్రాలు కొండలపై ఏర్పడటం జరిగింది. స్థల మహాత్మ్యం కారణంగా ఈ క్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది.
ఈ తరహా క్షేత్రాలను దర్శించడానికి మెట్ల మార్గంలో వెళుతూ వుండగా, ఎంతోమంది స్త్రీలు ఆ మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ కనిపిస్తుంటారు. వందల సంఖ్యలోనూ ... వేల సంఖ్యలోను గల ఈ మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ కొండపైకి చేరుకోవడం నిజానికి చాలా కష్టమైన పని. అందుకే భగవంతుడి మనసు గెలుచుకోవడానికీ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఇంతటి శ్రమకి సిద్ధపడుతుంటారు.
ఇక ఈ పద్ధతి ఒక ప్రత్యేక ఉత్సవంగా జరిగే క్షేత్రం ఒకటుంది ... అదే 'వేంపల్లె'. కడప జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు 'వృషభాచలేశ్వరుడు' పేరుతో పూజలు అందుకుంటూ వుంటాడు. వృషభాసురుడు అనే అసురుడిని వృషభ రూపంలో సంహరించిన అనంతరం స్వామివారు శ్రీనివాసుడిగా పద్మావతీదేవి సమేతంగా ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది.
ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన ఇక్కడ 'మెట్ల ఉత్సవం' జరుగుతూ వుంటుంది. వివాహం ... సంతానం విషయంలో సమస్యలు ఎదుర్కుంటోన్న యువతులు ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. భగవంతుడి నామాన్ని స్మరిస్తూ .. మెట్టు మెట్టుకీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ కొండపైకి చేరుకుంటూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన వివాహం విషయంలో ఆటంకాలు తొలగిపోతాయనీ, సంతానంలేక బాధపడుతోన్న వారికి ఆ లోటు తీరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.