ఈ దోనెల్లోని నీరు మహిమన్వితమైనదట !
సాధారణంగా ఏ క్షేత్రానికి వెళ్లినా అక్కడ గల తీర్థం ఏదో ఒక విశేషాన్ని కలిగినదిగా కనిపిస్తూ వుంటుంది. ఈ తీర్థాలు భక్తుల జీవన విధానాన్ని ఆధ్యాత్మిక పరంగాను ... ఆరోగ్యపరంగాను ప్రభావితం చేస్తూవుంటాయి. అందువలన భక్తులు క్షేత్రానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తుంటారో ... తీర్థానికి అంతటి ప్రాముఖ్యతను ఇస్తుంటారు. అలా క్షేత్ర పరంగా ... తీర్థ పరంగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న సరస్వతీదేవి ఆలయం మనకి 'మెదక్'లో కనిపిస్తుంది.
సరస్వతీ దేవి ఆలయాల్లో ఆ తల్లి వీణను ధరించి కూర్చుని దర్శనమిస్తూ వుంటుంది. కానీ ఈ క్షేత్రంలో ఆమె వీణను ధరించి నుంచుని దర్శనమిస్తూ వుండటం విశేషంగా అనిపిస్తూ వుంటుంది. ఈ ఆలయానికి చేరువలో గల మూడు తీర్థాలను 'దోనెలు' గా పిలుస్తుంటారు. 'ఇనుప దోనె' ... 'పాలదోనె' ... 'చీకటి దోనె' గా ఇవి తమ ప్రత్యేకతను చాటుకుంటూ వుంటాయి.
చీకటి దోనెలోకి దిగడం కాస్త కాష్టంగా వుంటుంది కనుక, మిగతా రెండు దోనెలలోని నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తుంటారు. ఈ నీరు ఎంతో స్వచ్చంగా ... తియ్యగా వుండటం విశేషం. ఈ నీటిని తీర్థంగా సేవించడం వలన బుద్ధి వికసించడమే కాకుండా, అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఈ నీటితో స్నానం చేయడం వలన చర్మ సంబంధిత వ్యాధులు నివారించబడతాయని అంటారు.
ఆలయానికి రాలేకపోయిన తమ కుటుంబసభ్యుల కోసం భక్తులు ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకుని వెళుతుంటారు. ఈ నీటిని పశువుల శాలలోను ... పొలాల్లోనూ చల్లడం వలన పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు భావిస్తుంటారు. ఇంతటి విశేషాన్ని కలిగిన ఈ ఆలయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకుని దర్శిస్తుంటారు. వాళ్లకి జ్ఞానాన్ని ... ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆ తల్లిని కోరుతుంటారు.